రెండు రోజుల్లో బాలల దినోత్సవం వచ్చేస్తోంది. మన నాయకులకి నెహ్రూనీ, ఆయన వారసులనీ ఘనంగానూ, పిల్లలని కంటి తుడుపుగానూ తల్చుకోడానికి ఓ అవకాశం వస్తోంది. బొత్తిగా పిల్లలకోసం ప్రభుత్వం ఏమీ చేయడం లేదని జనం అనుకోకుండా పిల్లల కోసమని రాష్ట్ర రాజధానిలో అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవం జరపడానికి ఏర్పాట్లు ఘనంగా సాగుతున్నాయి. మరి ఆ సినిమాలు చూడడానికి అవకాశం లేని పిల్లల కోసం ప్రభుత్వం ఏమీ చేయనట్టే కదా.. అని అడక్కూడదు. ఆరోజు స్కూళ్ళకి సెలవు ఇస్తోంది.. ఇంకేం కావాలి??
అసలు పిల్లల కోసం ఎందుకు ఆలోచించాలి? ఎందుకంటే పిల్లలే భవిష్యత్తు కాబట్టి. మన ఇంటికైనా, మన దేశానికైనా భవిషత్తు పిల్లలే కదా. మరి పిల్లల కోసం ఆలోచించడం అంతే రేపటి రోజు కోసం ఆలోచించడమే కదా? మన పిల్లలకోసం మనం ఆలోచిస్తున్నట్టే, మొత్తం అందరు పిల్లల గురించీ ఆలోచించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే కదా మరి? ఆలోచించడం అంతే, 'బడి బాట' 'మళ్ళీ బడికి' లాంటి పేరు గొప్ప ప్రోగ్రాములు ప్రకటించి ఊరుకోవడమేనా? వాటి అమలు సంగతి పట్టించుకోవాలా, వద్దా?
అక్షరాస్యత లాంటి విషయాల్లో వెనుకబడిఉన్న ఆంధ్ర దేశం, బాలకార్మికుల సంఖ్య విషయంలో మాత్రం ముందుంది. చవకగా దొరికే కూలీలు, చెప్పిన పని కిమ్మనకుండా చేస్తారు, ఇచ్చింది పుచ్చుకుంటారు, పెద్దల యందు ఉండే భయం వల్ల జాగ్రత్తగా పని చేస్తారు.. ఇన్ని సౌలభ్యాలు ఉన్నాయి కాబట్టే కాబోలు పొలాల్లోనూ, ఫ్యాక్టరీల్లోనూ, చివరికి ఇళ్ళలో కూడా చిన్న పిల్లలు పని చేస్తూ కనిపిస్తారు. పిల్లలు పని చేస్తున్నారు అంటే, కేవలం వయసుకు మించి శ్రమ పడుతున్నారు అని మాత్రమే కాదు.. భవిష్యత్తు అనేది లేకుండా చేసేసుకుంటున్నారు కూడా. చదువనేదే లేకపోవడం వల్ల వాళ్లకి ఎప్పటికీ కూలి పని తప్ప మరో ప్రత్యామ్నాయం దొరకదు కదా..
బాలకార్మిక వ్యవస్థని రూపుమాపడం కోసం ప్రభుత్వం ప్రకటిస్తున్న పథకాలు ఎందుకు విజయవంతం కావడం లేదు? రెండు కారణాలు కనిపిస్తాయి. పథక రచనలో పొరపాట్ల కారణంగా అవి ఆశించిన ఫలితాలు ఇవ్వడం లేదనిపిస్తుంది. పిల్లలు పనికి వెళ్లడానికి మూల కారణం పేదరికం. తల్లిదండ్రుల సంపాదన కుటుంబం గడవడానికి సరిపోకపోవడం. ఇంకొంచం లోతుకి వెళ్తే తండ్రి సంపాదన తాగుడుకి పోగా, కేవలం తల్లి సంపాదనతోనే కుటుంబం గడవాల్సి రావడం. అసలు జబ్బుకి చికిత్స చేయకుండా పైపైన మందు పూయడం వల్ల రోగం పూర్తిగా తగ్గదు కదా. పోనీ ఆ మందైనా సక్రమంగా పూస్తున్నారా అంటే, పథకాల అమలులో వైఫల్యాలు బోల్డన్ని కనిపిస్తూ ఉంటాయి. ఎక్కడా జవాబుదారీ తనం కనిపించదు.
ప్రతి విషయానికీ ప్రభుత్వాన్ని తిట్టుకుంటూ కూర్చోవడమేనా? మనం ఏమీ చేయలేమా?? కచ్చితంగా చేయగలం. పనిమనిషి పిల్లలు వాళ్ళమ్మ వెనుక వచ్చి మనింట్లో పని చేయకుండా మనం ఆపగలం. మన వీధి చివర టీకొట్లో చిన్న పిల్లాడు టీలు అందిస్తుంటే, అతన్ని మానిపించే వరకూ ఆ కొట్టుకి రానని చెప్పగలం. ఏదైనా షాపులో చిన్న పిల్లలని పనిలో చూస్తే, ఆ యజమానితో మాటకలిపి మాటల మధ్యలో పిల్లలని పనిలో పెట్టుకుంటే లేబర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కేసు పెడతారని చెప్పగలం. పని మానేసిన పిల్లలు బడికి వెళ్తూ ఉంటే వాళ్ళని ప్రోత్సహించగలం. వీటన్నింటితో పాటు ప్రభుత్వం చేత పని చేయించడానికి ఏదైనా మార్గమూ ఆలోచించగలం. ఇదంతా స్వార్ధానికి అతీతంగా కాదు.. రేపటి రోజు బాగుండాలనే స్వార్ధం తోనే..
Thursday, November 12, 2009
Tuesday, November 10, 2009
నవ్వినా కన్నీళ్ళే..
ఒకటి కాదు.. రెండు కాదు.. పద్దెనిమిదేళ్ళ నా నిరీక్షణ ఫలించింది. అవును 'నవ్వినా కన్నీళ్ళే..' అనే నవల కోసం నేను అక్షరాలా పద్దెనిమిదేళ్ళు ఎదురు చూశాను.. ఎన్నో చోట్ల వెతికాను.. యెంతో మందిని అడిగాను. చివరికి చాలా యాదృచ్చికంగా నిన్న సాయంత్రం నా కంట పడింది ఈ పుస్తకం. ఇంతకీ ఏమిటీ నవల ప్రత్యేకత? సమాధానం ఒకే ఒక్క మాట.. ఈ నవల ఆధారంగానే 'సీతారామయ్య గారి మనవరాలు' అనే సినిమా తీశారు.
మొదటిసారి సినిమా చూడడం పూర్తవ్వగానే నేను చేసిన మొదటి పని కథ ఎవరిదీ అని ఎంక్వయిరీ చేయడం. 'మానస' రాసిన 'నవ్వినా కన్నీళ్ళే..' నవల ఆధారం గా సినిమా తీశారని తెలిసింది. అది మొదలు ఆ నవల చదవాలని ప్రయత్నం. ఆ నవల 'ఆంధ్ర ప్రభ' లో ప్రచురించారని తెలిసి ఆ దిశగానూ ప్రయత్నాలు చేశాను..ప్చ్.. దొరకలేదు. గత పద్ధెనిమిదేళ్ళలోనూ సినిమాని వందల సార్లు (అక్షరాలా కొన్ని వందల సార్లు) చూశాను.. టైటిల్స్ చూసిన ప్రతిసారీ ఒకటే అసంతృప్తి.. నవల చదవలేక పోయాను కదా అని..
నిన్న సాయంత్రం పుస్తకాల షాపుకి వెళ్లి, ముందుగా అనుకున్న రెండు పుస్తకాలూ తీసుకుని, కొత్తగా ఇంకేం వచ్చాయా అని చూస్తున్న సమయంలో బాపు కవర్ పేజీతో వచ్చిన ఓ బరువైన పుస్తకం నా దృష్టిలో పడింది. పుస్తకం పేరు 'మదర్పిత...తాంబూలాది...' కథల సంపుటం. రచన 'మానస' . బుర్రలో బల్బు వెలిగింది.. నేను వెతుకుతున్న మానస ఈ మానస ఒక్కరే అయితే తప్పకుండా 'నవ్వినా కన్నీళ్ళే..' గురించిన వివరం ఈ పుస్తకంలో దొరుకుతుంది.
ఓ పక్కగా నిలబడి ముందుమాట చదువుతూ, ఎగిరి గంతెయ్యాలనే కోరిక బలవంతంగా అణచుకున్నాను. ముందుమాట లోనే నాక్కావలసిన వివరం దొరికేసింది.. అంతే కాదు.. అదే పుస్తకం చివర్లో ఆ చిన్న నవలనీ జత చేశారన్న తీపి కబురు కూడా . తర్వాత నేను ఏంచేశానో వివరంగా రాయక్కర్లేదు.. ఓ నవలని సినిమాగా తీసినప్పుడు చాలా మార్పులు, చేర్పులు చేస్తారాన్ని విషయాన్ని బాగా గుర్తు చేసుకుని చదవడం మొదలు పెట్టాను.
కథానాయిక సమీర పాతికేళ్ళ అమ్మాయి. బెజవాడ లోని తాతగారింట్లో తన మేనత్త కూతురి పెళ్ళికి అమెరికా నుంచి వస్తుంది. పెళ్ళికూతురు మినహా మిగిలిన బంధువులంతా ఆమెని ఆహ్వానించడానికి రైల్వే స్టేషన్ కి వెళ్తారు. మద్రాస్ విమానాశ్రయంలో ఆమెని రిసీవ్ చేసుకోడానికి వెళ్ళిన పెద్ద బావ సుందర్ ఇంటి పరిస్థితి అంతా వివరంగా చెబుతాడు సమీరకి.
తాతగారు పరంధామయ్య (ఈ పేరు సాహిత్యం లో మాత్రమే కనిపిస్తుంది) ఎనభై కి దగ్గర్లో ఉంటే బామ్మ అనసూయమ్మకి డెబ్బై దాటేశాయి. సమీర తలిదండ్రులు ఇండియా వదిలి వెళ్ళిపోడానికి కారణం ఆమె తండ్రి పెద్దల ఇష్టానికి వ్యతిరేకంగా వర్ణాంతర వివాహం చేసుకోవడమే. తాతగారు మనవరాలికి కుటుంబంలో కలుపుకోలేరు, ఆమె తల్లిది వేరే కులం అన్న కారణంగా..
బామ్మగారికి మాత్రం సమీరని సుందర్ కి ఇచ్చి పెళ్లి చేయాలని ఉంటుంది. ఇందుకోసం ఒక వృధా ప్రయత్నం కూడా చేస్తుంది ఆవిడ. సుందర్, అతని తమ్ముళ్ళ ప్రేమ కథలు, సమీర కాలేజీ లెక్చరర్ గా పనిచేయాలనుకోవడం, అక్కడి సమస్యలు, ఆమె మేనమామ రాజశేఖరం కుటుంబం.. ఇలా నవల్లో ఎన్నో కొత్త పాత్రలు, కొత్త సన్నివేశాలు ఉన్నాయి.
తాతయ్య-బామ్మ లతో మనవరాలి అనుబంధాన్ని రేఖామాత్రంగానే స్పృశించారు. అనసూయమ్మగారి హఠాన్మరణంతో యోగిగా మారిపోతారు పరంధామయ్యగారు. సమీర తలిదండ్రులు ఎనిమిదేళ్ళ క్రితం జరిగిన ప్రమాదం లో మరణించారన్న నిజం సుందర్ కి తెలియడమే నవల ముగింపు. ఊహించినట్టుగానే నవలకీ, సినిమాకీ చాలా భేదం ఉంది. అయితేనేం.. ముందుమాటలో అవసరాల రామకృష్ణారావు చెప్పినట్టు 'నవ్వినా కన్నీళ్ళే..' నవల లేకపొతే 'సీతారామయ్య గారి మనవరాలు' సినిమా లేదు.
దాదాపు ముప్ఫయ్యేళ్ళ క్రితం రాసిన ఈ నవల అప్పట్లో 'ఆంధ్రప్రభ' నిర్వహించిన నవలల పోటీల్లో బహుమతి గెలుచుకుంది. 'మానస' అన్నది రచయిత ఉన్నవ వెంకట హరగోపాల్ కలం పేరు. స్టేట్ బ్యాంకులో వివిధ హోదాల్లో పనిచేసి రిటైరైన హరగోపాల్ తన భార్య 'మానస' పేరు మీద రాశారీ నవలని అప్పట్లో. ఈ నవలని సినిమా కథగా మార్చి యెంతో మందిని కలవడం, చివరికి క్రాంతికుమార్ సినిమా గా తీయడం, ఆనాటి తన అనుభవాలు, అనుభూతులు ముందుమాటలో రాసుకున్నారు రచయిత.
నాకైతే నవల చదువుతున్నంత సేపూ సినిమా కోసం కీరవాణి చేసిన నేపధ్య సంగీతం చెవుల్లో వినిపిస్తూనే ఉంది. దానికి తోడు మొన్నరాత్రే సినిమాని మరో సారి చూశాను, కాకతాళీయంగా.. ఈ నవలతో పాటుగా 'మదర్పిత..తాంబూలాది..' తో సహా నలభై కథలున్నాయి.. వాటన్నింటినీ చదవాల్సి ఉంది, వరుసగా... ('మదర్పిత..తాంబూలాది..' పేజీలు 422, వెల 200, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు)

Sunday, November 08, 2009
ఊరి చివరి ఇల్లు
హోరున కురిసే వర్షం.. చిమ్మ చీకటి.. ఊరికి దూరంగా ఉన్న ఒంటరి ఇల్లు.. ఆ ఇంట్లో ఉన్న ముగ్గురు మనుషులు.. ఎవరికి ఎవ్వరూ ఏమీ కారు. ఆ రాత్రి వాళ్ళ జీవితాలను ఎలాంటి మలుపు తిప్పిందన్నదే దాదాపు యాభయ్యేళ్ళ క్రితం తిలక్ రాసిన 'ఊరి చివరి ఇల్లు' కథ. కవిత్వం లాగే కథలమీదా తనదైన ముద్ర వేసిన రచయిత తిలక్. వచనమైనా, కవిత్వమైనా భావుకత్వం ఆయన కలం నుంచి పరవళ్ళు తొక్కుతుంది. మానవ మనస్తత్వ చిత్రణ మీద తిలక్ కి ఉన్న పట్టు కి పరాకాష్ట ఈ కథ.
రమ ఓ పాతికేళ్ళ యువతి. ఆమెది ఓ బరువైన గతం. మూడు నెల్ల పసికందుని కోల్పోయిన గాయం నుంచి ఆమె ఇంకా కోలుకోలేదు. ఇంత బాధ లోనూ ఆమె కళ్ళు 'విజయుడి' కోసం వెతుకుతూనే ఉన్నాయి. నిజానికి ఆ 'ఊరి చివరి ఇల్లు' రమ ది కాదు. ఆమె స్థితికి జాలిపడీ, తనకి పనికొస్తుందన్న ఆశ తోనూ ఆమెకి ఆఇంట్లో ఆశ్రయమిచ్చింది 'ముసిల్ది.' ఎందుకంటే జీవితపు చివరి రోజుల్లో తన బాగోగులు చూసే మనిషి కావాలి ముసిల్దానికి. రమ అందం, వయసు, అసహాయత చూశాక నమ్మకం కలిగింది, ఆమె తనని చూసుకోగలదని.
మన్నూ మిన్నూ ఏకమయ్యేలా వర్షం కురుస్తూనే ఉంటుంది బయట.. ఆ వర్షాన్ని చూస్తూ ఆలోచనల్లోకి వెళ్ళిపోతుంది రమ. వర్షం ఆమెని గతంలోకి తీసుకు పోతుంది. 'ఆరోగ్యం పాడైపోతుంది పిల్లా.. శాలువా కప్పుకో..' అన్న ముసిల్దాని మాటలు లెక్క పెట్టదు రమ. వర్షానికి అడ్డం పడి రోడ్డున వెళ్తున్న నిలువెత్తు మనిషి ఉన్నట్టుండి రమ కంటపడతాడు, ఆ సంజెవేళ. వర్షంలో చిక్కుకుపోతాడేమో అన్న భయంతో అతన్ని ఇంటికి పిలుస్తుంది రమ. ఆజానుబాహుడైన అతనిలో తన 'విజయుడి' పోలికలు చూసి కలవర పడుతుంది. ఆ రాత్రి తన ఇంట ఉండి మర్నాడు ఉదయం రైలుకి వెళ్ళమంటుంది అతన్ని.
రమ కలవరపాటుని గుర్తిస్తాడతను. అతని పేరు జగన్నాధం. తనకంటూ ఎవరూ లేని జీవితం అతనిది. ఎక్కడా స్థిరంగా ఉండే మనస్తత్వం కాదు జగన్నాధానిది. అతని పట్ల యెంతో ఆదరం చూపుతుంది ముసిల్ది. వేడి వేడిగా వండి పెడుతుంది. పక్క సిద్ధం చేస్తుంది. రమ కూడా అతని పట్ల అభిమానంగా ఉంటుంది. అతను తన విజయుడేమో అన్న ఆశ ఏ మూలో మినుకు మినుకు మంటూ ఉంటుంది ఆమెకి. బయట వర్షం ఆగాగి కురుస్తూ ఉంటుంది.
ఓ రాత్రి వేళ తను గాఢ నిద్రలో ఉండగా రమ లాంతరుతో వచ్చి తన ముఖాన్ని పరిశీలనగా చూడడం గమనిస్తాడు, అప్పుడే మేల్కొన్న జగన్నాధం. ఆమెకి తన గతం చెబుతాడు.. ఇంట్లోనుంచి పారిపోయి సైన్యంలో చేరిన వైనాన్ని వివరిస్తాడు. 'విజయుడు కూడా సైన్యంలోకే వెళ్ళాడు' అంటుంది ఆమె. ఓ స్నేహితుడిని చూడడం కోసం అతని ఊరికి వెళ్లి, అతను చనిపోయాడని తెలిసి అక్కడ ఉండడానికి మనస్కరించక తిరుగు ప్రయాణంలో ఆ ఊళ్ళో, ఆమె ఇంట్లో ఎలా చిక్కుకు పోయాడో చెబుతాడు జగన్నాధం.
అతను తనకి దగ్గరవాడు గా అనిపించడం తో తన గతాన్ని పంచుకుంటుంది రమ. అనాధ శరణాలయం లో కష్టాలు, విజయుడి స్నేహం, ఎడబాటు, మరో మోసగాడి బారిన చిక్కిన వైనం, చివరికి ముసిల్దాని ఆశ్రయం పొందడం వరకూ ఏదీ దాచకుండా చెబుతుంది రమ. ఆమె కథ విని కరిగిపోతాడు జగన్నాధం.. ఆమెని వివాహం చేసుకుంటానని మాటిస్తాడు. అతని చేతిని తన చేతుల్లోకి తీసుకుని నిశ్చింతగా నిద్రపోతుంది రమ. గదిలో మాటల్ని బయటినుంచి వింటుంది ముసిల్ది. జగన్నాధాన్ని బయటికి పిలిచి మాట్లాడుతుంది.. ఫలితం..అతను అప్పటికప్పుడే పెట్టె తీసుకుని బయటకు నడుస్తాడు.. తర్వాత ఏం జరిగిందన్నది కదిలించే ముగింపు. తిలక్ కథలన్నింటిలోనూ నాకు ఈ కథంటే ప్రత్యేకమైన ఇష్టం.

Saturday, November 07, 2009
ప్లంబరుడు
మా ఇంట్లో ట్యాప్ కి జలుబు చేసింది. శీతాకాలం లో మనుషులకి జలుబు చేయడం మామూలే కానీ, ఈసారి వెరైటీ గా ట్యాప్ కి జలుబు చేసింది. అదేదో యండమూరి సస్పెన్స్ నవల్లోలా ఠాప్ ఠాప్ ఠాప్ మంటూ ఒకటే చప్పుళ్ళు. చేతనైన వైద్యాలు చేసినా లాభం లేకపోవడం తో ప్లంబర్ ఆచూకీ వెతికి కాకి చేత కబురు పంపాను. యధాప్రకారం ప్లంబర్ రాలేదు. కబుర్లు మోసుకెళ్ళ లేక కాకులు నాకు కన్పించడం మానేశాయి. ఇక లాభం లేదని నేనే రంగం లోకి దిగాను.
నిన్న తనని కలిస్తే ఇవాళ తప్పక వస్తానని మాటిచ్చాడు. తన పేరు బాషా అని చెప్పి ఫోన్ నెంబర్ కూడా ఇచ్చాడు. నిజానికి బాషా ఒక్క సారి చెబితే వంద సార్లు చెప్పినట్టే.. కానీ, ఎందుకైనా మంచిదని ఉదయాన్నే నేనే బయలుదేరాను, బాషా ని తోడ్కొని రావడం కోసం. "ప్లంబరంటే డాక్టర్ లెక్క సార్.. మాతోని పనుంటే మా తానికే వస్తారు జనం.." ఇది బాషా మొదటి డైలాగు. కొంచం షాక్కొట్టినా తట్టుకున్నాను. అవసరం నాది కదా.
ఒక చిన్న చేతి సంచీ తో ఇంట్లోకి అడుగు పెట్టి నలు వైపులా కలియ చూసి, "ఇల్లు కట్టేది వేస్ట్ సార్.. ఏదొక ప్రాబ్లం ఉంటది.. అదే రెంట్ అనుకో.. ఏమొచ్చినా ఓనర్ చూస్కుంటడు" అని మరో విలువైన అభిప్రాయం ప్రకటించాడు. నిజానికి నేను మా ఓనర్ చెవిలో ఇల్లు కట్టుకుని పోరినా పనవ్వక పోవడం తో, బోల్డంత బిజీ గా ఉన్నా కూడా స్వయంగా ప్లంబర్ వేటకి బయలుదేరాను, 'చెవిలో జోరీగ' లాంటి పోరు పడలేక. అయాచితంగా నన్ను ఇంటికి ఓనర్ ని చేసేసినందుకు లోపల్లోపల సంతోష పడ్డాను.
"గిది మార్వాలే సార్.. నాతాన కొత్తదుంది" అని సంచిలోనుంచి ఓ ట్యాప్ తీశాడు. నాకు తెలియకుండానే నేను బాషా అసిస్టెంట్ గా మారిపోయాను. ఇంటికి వచ్చిన వాళ్ళని పలకరించి మాట్లాడడం గృహస్తు మర్యాద కదా.. అందుకని బాషా తో మాటకలిపాను. అతను చాలా స్వేచ్చా పిపాసి అనీ, బడి బందిఖానాలా అనిపించడం వల్ల చిన్నప్పుడే చదువు మానేసి ప్లంబింగ్ నేర్చుకున్నాడనీ తెలిసింది. ఒకే చోట ఉండడం తనకి చిరాకుట.. అందుకే ఊళ్ళు తిరుగుతూ ఉంటాడుట.
"సదివి బాగుపన్నోడెవడు సార్? ఎంత సదివినా ఒకని కింద నౌక్రీ నే సెయ్యాలి" మరో జ్ఞాన గుళిక ని ప్రసాదించాడు. "నా తమ్ముడు పది సద్విండు.. నౌక్రీ ల చేరిండు.. ఏం లాబం? పాణం బాలేకున్నా పనికి పోవాలె.. ఏడకీ పోనీకి లేదు.." అతనితో మాట్లాడడం కన్నా, చెప్పింది విని గమ్మునుండడం మంచిదని అభిప్రాయానికి వచ్చేశాను. "గదే నన్ను సూడండి.. నచ్చితే పని చేస్తా.. లేకుంటే ఫోన్ బంద్ చేస్తా.. ఎవడేమంటడు?" నేను ఓవర్ హెడ్ టాంక్ ఆపి, తను వదలమన్నప్పుడు నీళ్ళు వదిలే పనిలో ఉన్నాను. ట్యాప్ సెట్ అవ్వలేదు. మళ్ళీ బిగిస్తున్నాడు.
"పిల్లకాయలు సదువులు సదువులని తిరుగుతుంటే బాదేస్తాది సార్.. అంతా నౌక్రీ కోసం తిప్పల్లెక్క. గదే ఏదన్నా పని నేర్సుకున్నరనుకో, ఒకని తో పని లేకుండా ఆల్లే సంపాదిచ్చు కోవచ్చు కదా.. నా లెక్క పని చేసేటోనికి ఉన్న గౌరం, నౌకరి చేసేటోనికి ఏడికెల్లి వస్తది సారూ?" అతను పని పూర్తి చేసి చేతులు తుడుచుకుంటున్నాడు. నేను 'ఉషాపరిణయం' క్లైమాక్స్ లో సుమన్ గారి విశ్వరూపం చూసినప్పుడు కూడా అంతగా చేష్టలుడిగి పోలేదు. మనం జీవితంలో ఎంతమందినో కలుస్తూ ఉంటాం.. కొందర్ని ఆలస్యంగా.. ఇతన్నైతే జీవిత కాలం లేటుగా.. డబ్బులిచ్చి బాషా ని పంపించాను.

Thursday, November 05, 2009
విలేజ్ లో వినాయకుడు
తొలి సినిమా తో తనని తాను నిరూపించుకుని ప్రేక్షకుల రివార్డు తో పాటు ప్రభుత్వ అవార్డునూ అందుకున్న దర్శకుడు తనే నిర్మాతగా మారి తీస్తున్న రెండో సినిమా. అది కూడా మొదటి సినిమాకి సీక్వెల్. కోనసీమ నేపధ్యంలో గోదారి ఒడ్డున తొంభై శాతం షూటింగ్ జరుపుకుంది. పాటలు వినసొంపుగా ఉన్నాయి. హీరో పెర్ఫార్మన్స్ ఆల్రెడీ నచ్చింది... ఈ కారణాలు చాలనిపించాయి నాకు, 'విలేజ్ లో వినాయకుడు' సినిమా రిలీజ్ షో చూడ్డానికి.
ప్రేక్షకులకి ఒక కథ చెప్పడం కన్నా తెలిసిన కథని కొత్తగా చెప్పడానికి ప్రయత్నించడంలో ఓ సాహసం ఉంది. ఆ సాహసాన్ని చేశాడు యువ దర్శకుడు సాయికిరణ్ అడివి. ఒక పల్చని, బాగా నలిగిన కథాంశాన్ని రెండున్నర గంటల పాటు ప్రేక్షకులని కూర్చోబెట్టి చూపించాలంటే ఏం చెయ్యాలో అవన్నీ చేశాడు దర్శకుడు. వీనుల విందైన సంగీతం, కంటికి ఇంపైన లొకేషన్లు, సిట్యుయేషనల్ కామెడీ.. ఇవన్నీ ఉన్నాయి సినిమాలో.
మెడిసిన్ చదివిన కావ్య (నూతన నటి శరణ్య మోహన్) మన కార్తిక్ ('వినాయకుడు' ఫేం కృష్ణుడు) ని ప్రేమిస్తుంది. తను వైద్యం చేసిన పేషెంట్ కి ఏమైనా జరిగితే తట్టుకోలేని సున్నితమైన మనస్తత్వం కావ్యది. చిన్నప్పుడే తల్లిని కోల్పోయిన కావ్య అంటే యెంతో గారాబం ఆమె తండ్రి లక్ష్మీపతి రాజు (రావు రమేష్) కి. ఈ కోనసీమ భూస్వామి, ఆర్మీ లో పని చేసి రిటైరై ఉమ్మడి కుటుంబాన్ని ఎలాంటి పొరపొచ్చాలూ లేకుండా నడుపుతూ ఉంటాడు.
లక్ష్మీపతి స్నేహితుడు పజిల్స్ భాస్కరం (యండమూరి వీరేంద్రనాథ్). ఇతని పనులు రెండు.. కనిపించిన వాళ్ళందరినీ పజిల్స్ తో వేధించడం, కావ్యకి తగిన వరుణ్ణి వెతికే పనిలో ఫెయిలవుతూ లక్ష్మీపతి చేత చివాట్లు తింటూ ఉండడం. ఎలాంటి వాళ్ళూ ఓ పట్టాన నచ్చరు లక్ష్మీపతి కి. ఇలాంటి పరిస్థితిలో కావ్య ఎంతగానో ప్రేమించిన అబ్బాయిగా ఆ ఇంట్లో అడుగుపెడతాడు కార్తిక్. అతను లక్ష్మీపతి మనసు గెలుచుకోగాలిగాడా? అన్నది కథ.
నిజానికి తెలుగు ప్రేక్షకులకి ఇదేమీ కొత్తకథ కాదు. అందుకే కథనం మీద ఆధార పడ్డాడు దర్శకుడు.. ప్రేక్షకుడు ఆలోచనలో పడకుండా ఉండడం కోసం హాస్య సన్నివేశాలని గుది గుచ్చాడు. క్లీన్ కామెడీ ని మాత్రమే ఎంచుకోవడం అభినందించాల్సిన విషయం. జంద్యాల పాపులర్ డైలాగు 'నాన్నా చిట్టీ..' కి నేపధ్యం లో వచ్చే సంగీతాన్ని కథానుసారం వాడుకుని మొదటి సగం లో హాయిగా నవ్వించాడు. అలాగే 'ముద్దుగారే యశోద..' కీర్తనని హీరో మీద చిత్రీకరించి 'పడమటి సంధ్యారాగం' గుర్తు చేశాడు.
తండ్రికూతుళ్ళ సెంటిమెంట్ సన్నివేశాలు గతంలో వచ్చిన కృష్ణవంశీ 'చందమామ' 'శశిరేఖా పరిణయం' లో చూసేసినవే.. తండ్రికి ఎదురు చెప్పలేని కూతురు, కూతురి ఎంపిక ని అంగీకరించలేని, అలా అని ఆమెని కష్ట పెట్టలేని తండ్రి. చాలా ఫ్రేముల్లో తెరమీద కిటకిటలాడుతూ జనం కనిపించడం వల్ల కూడా కృష్ణవంశీ గుర్తొచ్చాడు అప్పుడప్పుడు. అయితే, ప్రతి పాత్రకీ ఒక ఐడెంటిటీ ఇచ్చే విషయం లో మాత్రం కొంచం జాగ్రత్త పడ్డాడు దర్శకుడు.
నేటివిటీ విషయంలో గురువు శేఖర్ కమ్ముల చేసిన పొరపాటునే శిష్యుడు సాయికిరణ్ కూడా చేశాడు. కేవలం తెర నిండా గోదారినీ, పచ్చని కొబ్బరి తోటలనీ చూపించడం ద్వారా నేటివిటీ వచ్చేస్తుందనుకోడం పొరపాటు. పాత్రల ఆహార్యం, భాషా సంస్కృతులు.. ఇవన్నీ ఆ ప్రాంతాన్ని ప్రతిబింబించాలి. ఈ దిశగా మరిన్ని జాగ్రత్తలు తీసుకుని ఉంటే బాగుండేది. ('శ్రీ కనకమాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్ ' లాంటి వంశీ పాత సినిమాల్లో గోదావరి నేటివిటీ ని చూడొచ్చు) అలాగే సినిమా ప్రారంభం, ముగింపు విషయాల్లో ఇంకొచం శ్రద్ధ చూపి, సన్నివేశాలని రొటీన్ కి భిన్నంగా రాసుకుని ఉండాల్సింది అనిపించింది.
మణికాంత్ కద్రి సంగీతం లో వనమాలి (సింగిల్ కార్డ్) రాసిన పాటలు బాగున్నాయి. ముఖ్యంగా 'చినుకై వరదై..' 'నీలి మేఘమా..' పాటలు వెంటాడతాయి. ఎడిటింగ్ ఇంకొంచం జాగ్రత్తగా చెయ్యొచ్చు, ముఖ్యంగా రెండో సగంలో.. కృష్ణుడిని పెద్దగా ఫోకస్ చేయలేదనిపించింది.. బహుశా అతని పాత్ర 'వినాయకుడు' కి కొనసాగింపు కావడం వల్ల కావొచ్చు. కొంచం డల్ గా కనిపించాడు చాలా చోట్ల. శరణ్య బాగా చేసింది. రావు రమేష్, యండమూరి పర్వాలేదు.
"సినిమా విజయానికి యాభై శాతం క్రియేటివిటీ, మరో యాభై శాతం పబ్లిసిటీ సాయపడతాయి" అని ఆమధ్య ఏదో ఇంటర్వ్యూ లో చెప్పాడు సాయికిరణ్. క్రియేటివిటీ పాళ్ళు మరో పది, పదిహేను శాతం కలిపితే మరింత చక్కని సినిమా అయి ఉండేది 'విలేజ్ లో వినాయకుడు.'

Wednesday, November 04, 2009
నాయికలు-కజు
ఆమె తన మూడవ ఏట జరిగిన మారణ కాండకి ప్రత్యక్ష సాక్షి. ఆ గాయం తాలూకు గుర్తులు చెరగక ముందే పెంపుడు తల్లితో కలిసి పొరుగు దేశానికి ప్రయాణమయ్యింది. సంఘర్షణ ఆమె జీవితంలో ఒక భాగమయ్యింది. పెపుడు తల్లి ఎలాంటి లోటూ చేయకపోయినా వయసుతో పాటు ఆమెలో పెరిగిన కోరిక ఒక్కటే.. ఎప్పటికైనా "తన వాళ్ళని" కలుసుకోవాలని.. చదువు పూర్తవ్వడంతోనే, అమెరికా నుంచి ఇండియా కి ప్రయాణమయ్యింది, బంధువులని చూసే వంకతో. మూలాలని వెతుక్కుంటూ ఆ అమ్మాయి చేసిన అన్వేషణే సోనాలి బోస్ రాసిన ఆంగ్ల నవల 'అము.' కథానాయిక కజు.. కజోరి రాయ్.
అమెరికా వర్ణ వివక్ష కారణంగా ఇబ్బందులు పడుతున్న మూడో ప్రపంచ దేశాల పౌరుల కోసం పనిచేసే ఉద్యమకారిణి కేయ రాయ్ పెంపుడు కూతురు కజు. ఢిల్లీ శివార్లలోని చందన్ హోలా అనే పల్లెటూళ్ళో అంటు వ్యాధి ప్రబలి చాలా మంది చనిపోయారనీ, అప్పుడే తాను మూడేళ్ళ కజు ని పెంపకానికి తీసుకున్నాననీ కూతురికి చెబుతుంది కేయ. తన ఊరిని చూడాలని, తనవారంటూ ఎవరైనా ఉంటే వాళ్ళని కలుసుకోవాలనే కోరిక వయసుతో పాటే పెరుగుతుంది కజు కి. తను తన గతాన్ని తలచుకోవడం తల్లికి ఇష్టం లేదని తెలుసు ఆమెకి. అందుకే చదువు పూర్తవ్వగానే, అమ్మమ్మనీ (కేయ తల్లి), మావయ్య కుటుంబాన్నీ చూసే వంకతో ఢిల్లీ బయలుదేరుతుంది.
స్వతంత్ర భావాలున్న కేయ పెంపకం, అమెరికా వాతావరణం నేపధ్యంలో పెరిగిన కజు ది విలక్షణమైన వ్యక్తిత్వం. తను అనుకున్నది ఎలాగైనా సాధించే పట్టుదల ఉన్న అమ్మాయి. అయితే అందుకోసం ఎవరినీ ఇబ్బంది పెట్టలేని మొహమాటం కూడా ఉంది. ఎలాంటి విషయాన్నైనా తల్లితో ధైర్యంగా చర్చించగలదు. తన పదమూడో ఏట కలిగిన 'తొలి ముద్దు' అనుభవాన్ని ఆమె మొదట చెప్పింది కేయ కే.
చిన్నతనంలో తన స్నేహితుల కుటుంబాలని చూసి, తనకీ తల్లీ, తండ్రీ వాళ్లకి ఉదయం నుంచీ సాయంత్రం వరకూ మాత్రమే ఉండే ఉద్యోగాలు, చక్కటి సాయంత్రాలు, ఆహ్లాదకరమైన వారాంతాలు ఉంటే బాగుండేవని అనుకుంటుంది కజు. అయితే వయసు పెరిగే కొద్దీ తల్లి చేసే పనుల్లో గొప్పదనం అర్ధమవుతుంది ఆమెకి. ముఖ్యంగా తన స్నేహితులంతా తల్లిని అడ్మిరేషన్ తో చూస్తున్నాపుడు ఆమె కూతురు అయినందుకు గర్వపడుతుంది కజు. ఆమెతో పాటే ఉద్యమాలలో పాల్గొంటూ ఉంటుంది, తనకి వీలైనప్పుడల్లా.. పేదలనూ, వాళ్ళ కష్టాలనూ చూసి చలించిపోయే మనస్తత్వం ఆమెది.
ఢిల్లీ లో ఉంటున్నా బెంగాలీ సంప్రదాయాలని క్రమం తప్పకుండా పాటించే మావయ్య కుటుంబంతో, ముఖ్యంగా తన ఈడుదే అయిన మావయ్య కూతురు తుకి తో తొందరలోనే అనుబంధం పెరుగుతుంది కజు కి. ఇండియా వచ్చిన నెల్లాళ్ళకి పల్లెటూరు చూడాలనే వంకతో చందన్ హోలాకి ప్రయాణం చేస్తుంది కజు. ఆమెని ఒంటరిగా బయటకు పంపడానికి ఇష్టపడని మేనమామ కుటుంబం ఆమె వెంటే వస్తుంది. ఎంతగా ప్రయత్నించినా ఆ గ్రామం తో తనకి ఎలాంటి అనుబంధం ఉన్నట్టు అనిపించదు కజు కి.
ఓ గురుద్వారా నుంచి వినిపించే గుర్బానీ యెంతో పరిచయమైనదిగా అనిపిస్తుంది కజుకి. 'ఎందుకు' అన్న విషయం లో స్పష్టత ఉండదు ఆమెకి. తుకి బాయ్ ఫ్రెండ్ సిద్ధార్థ్ స్నేహితుడైన కబీర్ తో పరిచయ మవుతుంది ఆమెకి. సీనియర్ బ్యూరోక్రాట్ అరుణ్ సెహగల్ కొడుకైన కబీర్ తో మాటల యుద్ధం తో మొదలైన పరిచయం, అతనితో కలిసి ఒక మురికి వాడని చూడడానికి వెళ్ళేలా చేస్తుంది. ఢిల్లీ యూనివర్సిటీ సమీపం లో దాబా నడిపే గోబింద్ భయ్యా ఇల్లు, ముఖ్యంగా దగ్గరలోనే ఉన్న రైల్వే ట్రాక్ తనకి బాగా తెలిసినివిగా అనిపిస్తాయి కజుకి.
తనని ఎవరో తరుముతున్నట్టుగానూ, తనని తాను రక్షించుకోవాలని అంతరాత్మ చెబుతున్నట్టు గానూ అనిపించి ఒకరకమైన ఉద్వేగానికి గురవతుంది కజు. కబీర్ సాయంతో తన జన్మ రహస్యం తెలుసుకునే పని మొదలు పెడుతుంది. పాత రికార్డులు చూడడం ద్వారా తన మూడో ఏట చందన్ హోల లో అంటు వ్యాధి ప్రబలి పెద్ద యెత్తున జనం చనిపోయిన సంఘటన ఏదీ జరగలేదని తెలిసి ఆశ్చర్య పోతుంది. ప్రతి విషయాన్నీ తనతో చర్చించే కేయ ఇంత పెద్ద అబద్ధం ఎందుకు చెప్పిందో అర్ధం కాదు ఆమెకి. అది మొదలు తన ప్రయత్నాలు మరింత తీవ్రతరం చేసి జన్మ రహస్యాన్ని చేధిస్తుంది.
ఇండియన్ అమెరికన్ రచయిత్రి సోనాలి బోస్ రాసిన 'అము' నవల్లో కజు తో పాటు కేయ పాత్ర కూడా చాలా బలమైనదే. తనకి ఏమీ కాని పసి పిల్ల కోసం తన జీవితాన్నే త్యాగం చేసిన స్త్రీ కేయ. గతం తెలుసుకోడానికి కజు పడే తపన, చేసే ప్రయత్నాలు అలెక్స్ హెలీ 'రూట్స్' నవలని గుర్తు చేస్తాయి. ఇలాంటి కథాంశం తో వచ్చే సాహిత్యంపై 'రూట్స్' ప్రభావం పడకుండా ఉండడం సాధ్యం కాదేమో. మార్కిస్టు రాజకీయ నేపధ్యం ఉన్న కుటుంబం నుంచి రావడం వల్ల కావచ్చు, సోనాలి బోస్ రచనలో చాలా చోట్ల 'ఎరుపు' నీ 'ఎర్రజెండా' నీ సింబాలిక్ గా వాడారు. రాజకీయాంశాల చర్చలో ఆమె మార్క్సిస్టు పార్టీ భావజాలాన్నే బలపరిచారు.
'అము' పేరు తో కజు పాత్రలో కొంకణ సేన్ శర్మ, కేయ పాత్రలో తన పిన్ని, మార్కిస్టు పార్టీ నేత బృందా కరత్ లతో సోనాలి తను తీసిన ఆంగ్ల చిత్రానికి 2004 సంవత్సరానికి గాను 'గొల్లపూడి శ్రీనివాస్ మెమోరియల్ నేషనల్ అవార్డు' అందుకున్నారు. స్క్రీన్ ప్లే ని కొద్ది మార్పులతో నవలగా విడుదల చేశారు. నాలుగేళ్ల క్రితం తొలిసారిగా చదివిన ఈ నవలని, మాజీ ప్రధాని ఇందిర హత్య జరిగి పాతికేళ్ళు గడిచిన సందర్భంగా దేశ రాజధానిలో జరిగిన ప్రదర్శనల నేపధ్యంలో మరో సారి తిరగేశాను. గతం లో లాగే కజు, కేయ పాత్రలు వెంటాడుతున్నాయి. ('amu,' పేజీలు 142, వెల రూ. 200, పెంగ్విన్ ప్రచురణ).

Sunday, November 01, 2009
మీరయ్య-గుర్రమ్మ
అలనాడు త్రేతాయుగంలో ఓ మడేలు మోపిన నింద కారణంగా సీతమ్మ ని అడవులకి పంపాడు శ్రీరాముడు. ఇలనాడు ఈ కలియుగంలో, కొన్ని దశాబ్దాల క్రితం, రాముడంతటి మచి బాలుడినైన నా మీద నింద మోపింది ఓ మడేలమ్మ. ఫలితంగా ఏం జరిగిందో తెలియాలంటే, జరిగిన కథలోకి వెళ్ళాలి.
సృష్టి కర్త బహు చమత్కారి.. ఆయన సృష్టించిన జంటలు చాలు, ఆయన లీలా వినోదాలు ఎంతటివో తెలుసుకోడానికి. మచ్చుకి కొన్ని జంటలు.. అతను కప్ప అయితే ఆమె పాము.. అతను మేక అయితే ఆమె పులి.. అతను మీరయ్య అయితే ఆమె గుర్రమ్మ.. మీరయ్య మా ఊరంతటికీ ఏకైక మడేలు. 'గాడిద పని గాడిద, కుక్క పని కుక్క చెయ్యాలి' అనే నీతి కథలో మడేలుకి ఉన్నట్టుగా మా మీరయ్య కి గాడిద, కుక్క లేవు.
మీరయ్య కి ఎవరి మాటకీ ఎదురు చెప్పడం తెలీదు. వినయంగా తలొంచుకుని తన పని తాను చేసుకుపోతాడు. చివరికి తను చేయ దల్చుకున్నది మాత్రమే చేస్తాడు. అతని ఇల్లాలు గుర్రమ్మ. ఆమె కి పెద్దా చిన్నా అన్న భేదాలేవీ లేవు.. ఫెడీల్మని సమాధానాలు చెబుతుంది. 'కొరకంచు' అని ఆమెకి ముద్దుపేరు మా ఊళ్ళో. అసలు ఆమె పుట్టినప్పుడు వాళ్ళ ఊరి పంతులు గారు పంచాంగం చూసి 'గ' అనే అక్షరంతో పేరు రావాలని చెప్పి, 'గృహలక్ష్మి' అని ఆయనే పేరు నిర్ణయించాడట. జనం నోళ్ళలో ఆ పేరు గుర్రమ్మ గా రూపాంతరం చెందింది.
మామూలప్పుడు మనిషే కానీ, కోపం వచ్చినప్పుడు మాత్రం గుర్రమ్మ అస్సలు మనిషి కాదు. 'మన సత్యానికి సెల్లెలిగా పుట్టాల్సిన మడిసి' అని మా ఊరివాళ్ళు అనుకోడమూ కద్దు. అయితే ఆ కోపం ఎప్పుడు వస్తుందన్నది నర మానవుడికి తెలీదు. మా ఇంట్లో బట్టలు ఉతకడానికి వేసే అలవాటు లేక పోయినా తాతయ్యవి, నాన్నవి పంచలు, ఫేంట్లు, చొక్కాలు పొడిస్త్రీ (పొడి + ఇస్త్రీ) కి ఇచ్చే వాళ్ళు. మీరయ్య పిలవగానే వచ్చి పట్టుకెళ్ళి, ఓ ఐదారు కబుర్లు పెట్టాక తనకి వీలు కుదిరినప్పుడు పట్టుకొచ్చేవాడు. పిల్లల బట్టలకి ఇస్త్రీ అనే సమస్యే ఉండేది కాదు.
నేను ఐదో తరగతిలో ఉండగా ఒక రోజు బళ్ళో హెడ్మాస్టారు గారు వచ్చే వారం బడికి ఇన్స్పెక్టర్ గారు వస్తున్నారనీ, ఆ రోజు పిల్లలందరూ స్నానం చేసి, ఉతికి, ఇస్త్రీ చేసిన బట్టలు వేసుకుని రావాలనీ చెప్పారు. మా బళ్ళో పిల్లలందరూ ఉతికిన బట్టలు వేసుకుని వస్తే అది ఎనిమిదో వింత.. ఇంక ఇస్త్రీ అంటే అది కల్లో మాట. నేను ఇంటికి రాగానే ఈ వార్త అమ్మ చెవిన వేశాను.. అమ్మేమో ఆ వచ్చేది ఏ ప్రధాన మంత్రో, ముఖ్యమంత్రో అయినట్టు హడావిడి చేసి, నా బట్టల్లోనుంచి మూడు జతలు మంచివి తీసి సాయంత్రం మీరయ్యకి ఇస్త్రీ కి ఇచ్చేసింది.
అప్పుడు మొదలయ్యాయి నా కష్టాలు.. మీరయ్య ఎక్కడ కనిపించినా గుర్తు చెయ్యడం.. అతనేమో 'ఆయ్.. అట్టుకొచ్చేత్తానండి.. నానేం సేసుకుంటానండి మీ బట్లు.." అని నవ్వుతూ వెళ్ళిపోయేవాడు. ఈ "నానేం సేసుకుంటానండి" లో కూసింత వ్యంగ్యం లేకపోలేదు. ఎందుకంటే, పొడిస్త్రీ కి ఇచ్చిన చొక్కాలు (తాతయ్యవీ, నాన్నవీ) మీరయ్య వేసుకుని తిరుగుతాడనీ, తర్వాతెప్పుడో ఉతికి తెస్తాడనీ బామ్మకి బలమైన అనుమానం. మీరయ్య ఎప్పుడు కనిపించినా అనుమానాస్పదంగా చూసేది.. ఈ విషయం మీరయ్యకీ తెలుసు. హెడ్మాస్టారు రోజూ ఇస్త్రీ బట్టల విషయం గుర్తు చేస్తున్నారు.. నేను మీరయ్యకి కబుర్ల మీద కబుర్లు పెడుతూనే ఉన్నాను.
బళ్ళో ఇనస్పెక్షన్ రెండు రోజులకి వచ్చేసిందనగా నాకు టెన్షన్ మొదలయ్యింది. ఇస్త్రీ అట్టే పోయే ఉన్న వాటిల్లో మంచి బట్టలన్నీ మీరయ్య దగ్గరే ఉండిపోయాయి. పోనీ ఇస్త్రీ చెయ్యకుండా అయినా తెచ్చేయమని అడిగాను.. 'అయబాబోయ్.. అదేం మాటండీ.. మావింక ఊల్లో ఉండొద్దేతండీ.." అని బోల్డంత ఫీలయిపోయాడు, ఉదయాన్నే. నేను పొద్దున్న బడి నుంచి భోజనానికి ఇంటికి వచ్చి అమ్మని కనుక్కున్నా, బట్టలు వచ్చాయేమోనని.. రాలేదని చెప్పింది. సరిగ్గా అప్పుడే గుర్రమ్మ మా వీధిలో వెళ్తోంది. నాకు చాలా కోపం వచ్చినా బోల్డంత సహనంగా నా బట్టల గురించి అడిగాను.
"నాకు తెల్దండి.. మీ మీరయ్య గోర్ని అడగండి." అని కొంచం నిర్లక్ష్యంగా సమాధానం చెప్పిందామె. "అదేంటీ.. మీరిద్దరూ ఓ ఇంట్లోనే ఉంటారు కదా" నేను చాలా అమాయకంగానే అడిగాను కానీ, గుర్రమ్మకి కోపం నషాళానికి అంటింది. బుజాన ఉన్న మూట రోడ్డు మీద పడేసి, చేతులు బారజాపి అరవడం మొదలు పెట్టింది.. "ఏటండీ.. ఏటి మాటాడుతున్నారు? నేను మీరయ్య పెళ్ళాన్ని కాదంటారా? ఇదిగొండీ.. ఆడు కట్టిన తాడు" అంటూ దూసుకొచ్చింది.. నేనేదో చెప్పబోతున్నా కానీ ఆమె వినిపించుకోడం లేదు..
ఆవిడ గొంతు విని రోడ్డు మీద వెళ్ళే వాళ్ళంతా ఆగారు.. "అబ్బాయిగోరు అడూతన్నారూ.. నువ్వు మీరయ్య కి కట్టుకున్న పెల్లానివేనా.. లేక పోతే X Xకున్న దానివా.. అంతన్నారండీ.." అనేసరికి నాకు కాళ్ళలో వణుకు మొదలయ్యింది.. బుర్ర మొద్దు బారింది. అసలే నాన్న భోజనానికి వచ్చే టైము.. ఇదెక్కడ గొడవరా దేవుడా అనుకుంటున్నా.. పాపం.. నన్ను రక్షించడానికి అమ్మ రంగంలోకి దిగింది.. "ఇదిగో గుర్రమ్మా.. మా వాడు అలా అనలేదు.. మీ ఇద్దరి మాటలూ నేను చెవులారా విన్నాను" అంది కొంచం ధాటీగా.. గుర్రమ్మఅదే స్వరంలో అడిగిన వాళ్ళకీ, అడగని వాళ్ళకీ చెప్పేస్తోంది..
నాన్నొచ్చేలోగా ఈ గొడవ చల్లబడాలని నేను దేవుళ్ళందరికీ మొక్కడం మొదలెట్టాను. ఇంతలో గొడవ చూస్తున్న కొందరు ఉత్సాహవంతులైన మహిళలు తీర్పు చెప్పడానికి ముందుకొచ్చారు.. "ఆ బాబు అలాంటి మాటలు ఆడరు గుర్రమ్మో.. మాకు తెల్సు ఆయన సంగతీ.. నీ సంగతీ.." అనేసరికి, నా కళ్ళకి వాళ్ళు దేవతల్లా కనబడ్డారు.. కాసేపు అరిచి అరిచి అలిసిపోయిన గుర్రమ్మ, అమ్మ ఇచ్చిన మజ్జిగ తేట తాగి, ఊరగాయ పొట్లం పట్టుకుని, మూట భుజాన్నేసుకుని బయలుదేరింది.. మరి కాసేపటికి నాన్నొచ్చారు.
ఆ మర్నాడు సాయంత్రం మీరయ్య నా బట్టలు తెచ్చాడు.. "ఏటండీ.. గుర్రమ్మతో తగువేసుకున్నారంట" అని నవ్వుతూ అడిగి.. "మడిసి మంచిదేనండీ.. పాపం.. కూసింత కోపమెక్కువ.. మద్దినేల రేవు కాడినుంచి వొచ్చి అదే మీ బట్లు ఇస్త్రీ సేసింది.." అంటున్న మీరయ్య కేసి గుడ్లప్పగించి చూశాన్నేను. నేను తగువేసుకున్నానా? ఆమెకి 'కూసింత' కోపమా? .. నాన్న గానీ కొంచం ముందు వచ్చి ఉంటే ఏం జరిగేదో తల్చుకోడానికే భయమేసింది..

దీనికి సబ్స్క్రయిబ్ చెయ్యి:
పోస్ట్లు (Atom)